బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న చిత్రం దురంధర్ 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్లో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా నటించగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అలా విడుదలైన కేవలం నాలుగు రోజులలోనే రూ .750 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు సెలబ్రిటీలు.


సినిమా చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దురంధర్: ది రివేంజ్ సినిమా బృందానికి అభినందనలు తెలియజేశారు. ఎంతో అద్భుతమైన సినిమా , ఆదిత్యధర్ బాక్సాఫీస్, రణవీర్ కు , చిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సినిమా ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అని జై హింద్ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జియో స్టూడియో నిర్మించిన సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.


మొదటి వారంలోని ప్రపంచవ్యాప్తంగా రూ. 761 కోట్ల రూపాయలను రాబట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇండియన్ మార్కెట్లో రూ .300 కోట్ల క్లబ్ లోకి అత్యధిక వేగంగా చేరిన సినిమాగా దురంధర్ 2 నిలిచింది. బుక్ మై షోలో కూడా ఒక గంటలోనే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రికార్డు కూడా నమోదయింది. విదేశాలలో మొదటి వారంలోని సుమారుగా  రూ.210 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇలా అన్ని వైపులా కూడా దురంధర్ 2 సినిమా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: