కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయినట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంలో అక్కినేని అఖిల్ సినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నారట. ముఖ్యంగా అఖిల్ ,రామ్ చరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉండడం తోనే లెనిన్ సినిమా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మా సినిమా 2026 జూన్ 26 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లా ఉంటుందని ప్రతి ఎమోషన్ కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని అఖిల్ కు లెనిన్ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేశాయి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటుందని వినిపిస్తున్నాయి. పెద్ది సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఉండడంతో పాటుగా డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ ని చూపించిన తీరు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి