బాలీవుడ్లో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై రూ. 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది ధురంధర్ చిత్రం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. ఇందులో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ తదితర నటీనటులు కూడా నటించారు. అయితే ధురంధర్2 చిత్రం భారీ అంచనాల మధ్య మార్చి 19 ఉగాది పండుగ సందర్భంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది.


కలెక్షన్స్ పరంగా కూడా సునామి సృష్టిస్తోంది ధురంధర్2. అయితే ఇటువంటి నేపథ్యంలోనే పాకిస్థానీయుల నుంచి ఒక ఆసక్తికరమైన డిమాండ్ తెరపైకి వచ్చినట్లు వినిపిస్తోంది. ధురంధర్2 సినిమా కలెక్షన్స్ లో తమకి కొంత షేర్ ఇవ్వాలని డైరెక్టర్ ఆదిత్య ధర్ ను డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అక్కడి ప్రజలు అడుగుతున్నారు. లాభాలలో 70 నుంచి 80 శాతం షేర్ లేదా రూ .500 కోట్లు అయినా ఈ సినిమా కలెక్షన్స్ లో తమకు ఇవ్వాలి అంటూ అక్కడివారు డిమాండ్ చేస్తున్నారు.


తమ పాకిస్థాన్ ప్రాంతం పైన సినిమా తీసినందుకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని, తమ పాకిస్థాన్ ప్రాంతాన్ని కూడా అంత రిచ్ గా చూపించారు మీరు ఇచ్చే డబ్బుతోనైనా పాకిస్థాన్ దేశంలో రోడ్ల రిపేరు, తాగునీటి వంటి సమస్యలు లేకుండా అభివృద్ధి చేసుకుంటామంటూ కోరుతున్నారు. ఈ విషయం పైన భిన్నాభిప్రాయాలు పలువురు నెటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ధురంధర్2 చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా  రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత ఊపునిచ్చే అవకాశం ఉన్నది. ఓటీటి లో కూడా ఈ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే వచ్చేలా డీల్ కుదుర్చుకున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: