నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా 2023 మార్చి 30న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో దసరా పండుగ వాతావరణం, అలాగే స్నేహం ,ప్రతికారం వంటి బాగోద్వేగా సన్నివేశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ దసరా సినిమాకు మరింత ప్లస్ అని చెప్పవచ్చు.


సూరి పాత్రలో న్యాచురల్ స్టార్ నాని ఒదిగిపోయి మరి నటించారు. ఆయన డైలాగ్ డెలివరీ ,యాక్షన్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ హీరో నాని కెరియర్ లోనే బెస్ట్ అనిపించేలా చేశారు. కీర్తి సురేష్ కూడా తన అద్భుతమైన నటనతో సినిమాతో మరొకసారి తనని తాను ప్రూఫ్ చేసుకుంది. కీర్తి సురేష్ తన క్యారెక్టర్లో జీవించిందని కూడా చెప్పవచ్చు. ఈ సినిమాకి బలమైన, సెన్సిటివ్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ పాత్రలో అద్భుతంగా నటించింది. నాని, కీర్తి సురేష్ మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమానే హైలైట్ గా ఉన్నాయి. దసరా సినిమాలో ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ అభిమానుల చేత ప్రశంశలు అందుకునేలా చేశాయి.


దసరా సినిమా విడుదలై ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అభిమానులు ఈ సినిమాలో సీన్స్ గుర్తుండిపోయాయని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ .121 కోట రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. హీరో నాని సినీ కెరియర్ లోని ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. దసరా సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అభిమానులు ఈ సినిమా గురించి మరొకసారి వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం నాని సినిమాల విషయానికే వస్తే.. ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: