సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం.. థాయ్ కిళవి. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. 2026లో అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం లో రాధిక మంచం పైన ఉండి కేవలం కళ్ళతో హావభావాలతో పండించిన నటన ఈ సినిమాకి హైలెట్. ఈ చిత్రాన్ని యంగ్ హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ సినిమాకు భారీ లాభాలు రావడంతో లాభాలలో కూడా నటి రాధికా కు రెమ్యూనరేషన్తో పాటు లాభాలు కూడా ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి.


ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక సీనియర్ నటి లాభాలలో వాటా ఇవ్వడం మొదటిసారి అని రాధ ఈ విషయాన్ని చాలా గర్వంగా స్వయంగా తెలియజేసింది. అలాంటి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లోకి రాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది 10 ఏప్రిల్ 2026 న  ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కేవలం తమిళ ఆడియోతో మాత్రమే అందుబాటులోకి రానుంది.


పల్లెటూరి నేపథ్యంలో సాగే కామెడీ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 70 ఏళ్ల వయసు ఉన్న పాత్రలో రాధిక శరత్ కుమార్ అద్భుతంగా నటించింది. ఇందులో ఆమె వడ్డీ వ్యాపారి గా కనిపించిన తీరు, కుటుంబాన్ని తన కను సైగలతో భయపెడుతుంది. ఇవన్నీ సరికొత్తగా ఉండడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే సినిమాగా అనిపిస్తుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ అద్వంతం నవ్వులు పూయిస్తూనే ఈ సినిమాలో మనస్సు హత్తుకునేలా సన్నివేశాలను తెరకెక్కించారు. మరి థియేటర్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటి లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి తెలుగులో విడుదల చేస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: