నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బ్యాక్ టు బ్యాక్ వరుస క్రేజీ ప్రాజెక్టులను చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తాజాగా బాలయ్య మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో 111 సినిమా చేస్తున్న బాలయ్య వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వీరసింహారెడ్డి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు రాబోయే సినిమా పైన కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.


ఒకపక్క మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా  రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేసుస్తోంది. గోపీచంద్ మలినేని తర్వాత బాలయ్య తదుపరి ప్రాజెక్టు 112 డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే త్వరలోనే మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఇప్పుడు 113 ప్రాజెక్టు కూడా చేయడానికి బాలయ్య ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం నాంది లాంటి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ విజయ్ కనకమెడలతో బాలయ్య సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి.


బాలకృష్ణకు కథ వినిపించగా విజయ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలయ్య ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చేకూరి నిర్మించబోతున్నారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశం ఉన్నది ఉంది.ఇందులో కూడా బాలయ్య పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు ఇందుకు సంబంధించి టాలీవుడ్ లో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ విషయాల పైన బాలయ్య ఏమైనా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: