అలా ప్రముఖ డాన్స్ రియాల్టీ షో బీబీ జోడి సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొనింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసింది దమ్ము శ్రీజ. అదేమిటంటే ఆమె ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా మీరు కూడా మీ పార్టనర్ ను టెంపుల్ కి తీసుకువెళ్ళమని అడగండి అంటూ ఒక క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేసింది.
దమ్ము శ్రీజ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నేటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రీజ త్వరలోనే వివాహం చేసుకుంటుందేమో! అందుకే వీడియోతో ఇలా హింట్ ఇచ్చిందంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అతను మీ బావ ఫేస్ రివిల్ చేయొచ్చు కదా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే దమ్ము శ్రీజ తన బావతో వివాహం చేసుకోబోతోందా? అందుకే ఫేస్ రివిల్ చేయలేదా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ విషయం పైన దమ్ము శ్రీజనే స్పందించాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి