ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అమీర్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అమీర్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యారని ఆ సమయంలో తాను మద్యానికి బానిస అయ్యానని, తన మొదటి భార్య రీనా ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడ్డాను ఎంతో భరించలేని మనోవేదనకు గురయ్యానంటూ తెలిపారు.
తన భార్య ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు నా గుండె ముక్కలు అయింది. ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో తెలియకనే తాను మద్యానికి బానిసయ్యానని, రోజుల తరబడి గంటల తరబడి మద్యం తాగేవాడినంటూ తెలిపారు. తన పిల్లల భవిష్యత్తు ఆలోచించిన తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం తాను నిలబడాలని ఆ క్షణమే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను ఆ క్షణం నుంచి మద్యం మానేశానని తెలిపారు.. అమీర్ ఖాన్, రీనా దత్త వివాహం 1986 లో జరగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2002లో వీరిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా అమీర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడినట్లు తన ప్రేయసిని పరిచయం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి