ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటి ప్లాట్ఫాములలో ఒకటైన నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రిమింగ్ కాబోతోంది. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన రానే వచ్చేసింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ ,మలయాళం, హిందీ వంటి భాషలలో ఏకకాలంలో స్థాయిలో ఓటిటి స్ట్రీమ్మింగ్ తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఈ సినిమా ఓటీటి కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్లో రిజల్ట్ ఎలా ఉన్న ఓటీటిలో ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి మరి.
స్టోరీ విషయానికి వస్తే నల్లములకు సమీపంలో ఒక గూడెంలో పాఠాలు చెప్పే చంద్రశేఖర రావు (కె ఎస్ రవికుమార్) అనే మాస్టర్ తన జీవితాన్ని జనం కోసమే అంకితం చేస్తారు. కూలి పనులకు వెళ్లే పిల్లలను తిరిగి మళ్లీ బడికి వచ్చేలా చేస్తారు. ఇక అదే గ్రామంలో చిన్నయ్య అనే కుర్రోడు ఆలోచనలు, అతనిలోని ఆవేశం గ్రహించి అతనికి భగత్ సింగ్ అని పేరు పెట్టి ఆ పాఠాలు చెబుతారు. ఇక తనకు పాఠాలు చెప్పిన చంద్రశేఖర్ మాస్టర్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వడంతో ఏసీపి ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) అతడికి రక్షణగానే ఉంటారు. అలా ప్రతి సంఘటనను ఉస్తాద్ ఎలా ఎదుర్కొన్నారు? తన జీవితంలోకి లీల (శ్రీ లీల) , శ్లోక (రాశి ఖన్నా) ఎలా వచ్చారు అనేది మిగిలిన స్టోరీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి