ఈ ఫోటో ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెంచుకున్నది, కొనుక్కున్నది కాదు అంటూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ కుమార్ మన్నవ అనే కోచ్ సహాయంతోనే ఎన్టీఆర్ తన బాడిని ఇలా పెంచారు. అయితే అది కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా కోసమే అంటూ ఎన్టీఆర్ ఆ సినిమాని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో మరొకసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారేమో అంటూ అభిమానులు కూడా వైరల్ గా చేస్తున్నారు.
ఈ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాని ఎన్టీఆర్ మరొకసారి షేక్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నారని ట్రోల్ చేసిన వారు సైతం ఈ ఫోటో చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. మరి డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా చాలానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు ప్రాంతాలలో షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. చివరిగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన వార్ 2 సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా పైన అభిమానులు అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి ఈ చిత్రంతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి