ఈ గ్లింప్స్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక పిరియాడికల్ లేదా మైథాలజీ నేపథ్యం కలిగిన యాక్షన్ డ్రామా చిత్రంగా కనిపిస్తోంది. గోపీచంద్ లుక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది. ఏటువంటి మాటలు , డైలాగ్స్ లేకుండానే గ్లింప్స్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దేశ చరిత్రలోనే ఎవరికి తెలియని ఒక గొప్ప అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు సమాచారం. గతంలో ఘాజీ, అంతరిక్షం వంటి చిత్రాలతో పేరు సంపాదించిన సంకల్ప్ రెడ్డి గోపీచంద్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా చూపించబోతున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ కు జోడిగా రీతు వర్మ నటిస్తూ ఉండగా అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ కు భరత వర్ష సినిమా ఈసారి హిట్ పడుతుందని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చివరిగా 2024లో భీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వలేదనిపించుకున్నాయి. కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్ట లేకపోయాయి. అందుకే ఈసారి కాస్త లేట్ అయినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నారు గోపీచంద్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి