బాక్సాఫీస్ వద్ద 'సలార్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా తారక్‌ను ఢీకొట్టే ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎంత పవర్ ఫుల్‌గా ఉంటాడో, విలన్ కూడా అంతే క్రూరంగా, బలంగా ఉంటాడు. మొదట ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ను సంప్రదించారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి బాలీవుడ్ చాక్లెట్ బాయ్ టర్న్డ్ యాక్షన్ హీరో షాహిద్ కపూర్ ను రంగంలోకి దింపాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. షాహిద్ కనుక ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే, నార్త్ ఇండియాలో ఈ సినిమా మార్కెట్ ఊహించని రేంజ్‌కు వెళ్లడం ఖాయం.


ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మార్క్ పర్ఫార్మెన్స్ తోడైతే వెండితెరపై ఒక 'డ్రాగన్' సునామీని చూడటం పక్కా! ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నారట.ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలకు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో అదిరిపోయిందో మనకు తెలుసు. ఇక ‘సప్త సాగరదాచె ఎల్లో’ ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా, బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు మరింత వెయిట్ పెంచుతోంది.ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్‌కు ఇది పక్కా బిర్యానీ లాంటి సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ - తారక్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను డ్రాగన్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: