బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైంది! 'వీరసింహారెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పుడు NBK111 తో మరోసారి హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో, బాలయ్యను ఒక పవర్‌ఫుల్ 'రాజు'గా చూపిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్‌డేట్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.బాలయ్య సినిమాలకు ఎస్.ఎస్. తమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలుసు. ఇప్పుడు NBK111 కోసం తమన్ తన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు పవర్‌ఫుల్ ట్యూన్స్‌ను తమన్ లాక్ చేశాడట. అందులో ఒక సాంగ్‌కు ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాట వింటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెటప్‌లో షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే, అదే లొకేషన్‌లో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ అంటేనే విజువల్ ఫీస్ట్.. మరి గోపీచంద్ మలినేని దాన్ని ఏ స్థాయిలో డిజైన్ చేశారో చూడాలి.ఈ సినిమాలో బాలకృష్ణ ఒక రాజు పాత్రలో కనిపించబోతున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే క్లారిటీ వచ్చేసింది. పీరియాడిక్ కథ కావడంతో బాలయ్య గెటప్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉండబోతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది.


బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక సక్సెస్ ఫుల్ సెంటిమెంట్. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత సతీష్ కిలార్ అత్యున్నత నిర్మాణ విలువల(Production Values)తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: