తెలుగు బుల్లితెరపై ఎంతో మేల్ యాంకర్ సుడిగాలి సుదీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత పలు షోలలో హొస్టుగా కూడా పనిచేశారు. అదే క్రేజీతో సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాగానే ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా తోటి యాంకర్ రష్మీ తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ కూడా రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. కానీ తాజాగా మరో బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి, సుధీర్ ప్రేమలో ఉన్నారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన దీపికా పిల్లి క్లారిటీ ఇచ్చింది.


నిన్నటి రోజున దీపికాపిల్లి, సుధీర్ నెదర్లాండ్లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా దీపికా పిల్లి అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ఫోటో సోషల్ మీడియాలో బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఈ విషయం పైన దీపికా పిల్లి స్పందించిన తీరు అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కి గురైందని అధికారికంగా ప్రకటించింది. నిన్న రాత్రి నా  ఇన్స్టా  స్టోరీస్ లో షేర్ చేసిన ఫోటోలు ఏఐ జనరేటర్ అని అది ఫేక్ ఫోటోలని స్పష్టం చేసింది.



నా ప్రమేయం లేకుండా ఈ పోస్ట్ షేర్ చేశారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని దీపికా తన ఫాలోవర్లను కోరింది. ఈ ఫోటోని ఎక్కడా కూడా షేర్ చేయొద్దండి అలాంటి కంటెంట్ ని ప్రోత్సహించకండి ప్రస్తుతం నా అకౌంట్ ను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నానని మీరు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఒక నోట్ విడుదల చేసింది దీపికా. దీంతో సుధీర్, దీపికా పిల్లి వెకేషన్ లో ఉన్నారనే వార్తలలో నిజం లేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ విషయం పైన దీపిక పోలీసులను ఆశ్రయిస్తుందో లేదో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: