టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేస్తోంది. అంతేకాకుండా పెద్ది సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు వినిపించింది. సాధారణంగా సినిమా విడుదల తేదీలు మారితే ఓటీటి సంస్థల అగ్రిమెంటులో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే పెద్ది సినిమా విషయంలో కాస్త నెట్ ఫ్లిక్ పాజిటివ్ గానే ఉన్నట్లు వినిపిస్తోంది.



పెద్ది సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉన్న, ఒకవేళ వాయిదా పడినప్పటికీ కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటు నెట్ ఫ్లిక్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాయిదా పడుతుందని భావించి డీల్ రేటు తగ్గించడం లేదా ఒప్పందాన్ని మార్చడం వంటివి అసలు లేవంటూ ఆ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ కలిగి ఉండడంతో ఈ సినిమా పైన విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఎప్పుడు విడుదలైన డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన కచ్చితంగా భారీ వ్యూస్ రాబట్టడం ఖాయమని నెట్ ఫ్లిక్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.


అందుకే పెద్ది విషయంలో మాత్రం ఎలాంటి రూల్స్ పెట్టుకోలేదు అన్నట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. కేవలం స్పెషల్ సాంగ్ మినహా మిగతా అంతా కూడా పూర్తి అయినట్లు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం అనుకున్నట్టుగానే ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్ లో చేయని పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: