టాలీవుడ్‌లో వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన ‘హిట్ మిషన్’ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. 2027 సంక్రాంతి రేస్‌ను టార్గెట్ చేస్తూ ఆయన తెరకెక్కిస్తున్న ఈ కొత్త సినిమా ఇప్పటినుంచే అంచనాలను ఆకాశానికెత్తుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఒక క్రేజీ మల్టీస్టారర్ కావడం దీనిపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇందులో వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కలిసి నటించబోతుండడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే, యువ నటి కృతిశెట్టి ఇప్పటికే ఒక హీరోయిన్‌గా ఖరారైంది. మరో కీలక పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్, కథ, దర్శకుడి ట్రాక్ రికార్డ్ అన్ని కలిసి ఈ సినిమాను రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మార్చేశాయి.

ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఈ చిత్రం డిజిటల్ మార్కెట్‌లో రికార్డ్ స్థాయి క్రేజ్‌ను సృష్టించడం విశేషం. అనిల్ రావిపూడి గత చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు లాగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి కూడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 భారీ ధరకు డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ దర్శకుడి సినిమాలకు ఓటీటీలో మంచి వ్యూస్, హై రేటింగ్స్ రావడం వల్ల ఈ డీల్ రికార్డు స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు విశాఖపట్నంలో వేగంగా కొనసాగుతున్నాయి. తన ప్రతి సినిమాకు అక్కడే స్క్రిప్ట్ ఫైనల్ చేసే సెంటిమెంట్ ఉన్న అనిల్ రావిపూడి, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. కథలో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.

త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లి, షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి సీజన్‌లో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని అనిల్ రావిపూడి భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటినుంచే ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ టైమ్‌కి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: