సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇప్పటికే ఈ సినిమాని భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా లీకుల ద్వారా వీడియోలు, ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కూడా మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఒక కీలకమైన సన్నివేశం సీన్ సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ విజువల్ సీన్ నెట్టింట వైరల్ గా మారడంతో అభిమానులే షాక్ అవుతున్నారు. రాజమౌళి వంటి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెట్లో ఎవరో ఒకరు సీక్రెట్ గా ఈ వీడియోలను తీస్తున్నారని సినిమా హైప్ దెబ్బ తీసే ప్రమాదం ఉందని అభిమానులు కూడా హెచ్చరిస్తున్నారు.


రాజమౌళికే ఈ సినిమా లీకులు సమస్య కొత్తేమీ కాదు గతంలో కూడా బాహుబలి, rrr వంటి చిత్రాలు సినిమా షూటింగ్ సమయంలో కూడా కొన్ని కీలకమైన సీన్స్ మరియు యుద్ధానికి సంబంధించి క్లిప్పింగ్స్ కూడా వైరల్ గా మారాయి. రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో చాలా రహస్యంగానే సర్ప్రైజ్లను ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు లీకుల వల్ల రాజమౌళి పడుతున్న శ్రమ అంతా కూడా వృధా అవుతోందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం తన అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడ రాజీపడడం లేదు. ఏప్రిల్ 7 2027న ప్రపంచవ్యాప్తంగా వారణాసి సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: