తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ విష్ణు ప్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఈమధ్య ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. ఇటీవల అశ్లీలత పేరీట ఈమె పైన ఒక కేసు కూడా నమోదయ్యింది. ముఖ్యంగా ఆమె సబ్స్క్రిప్షన్ ఆదాయం విష్ణు ప్రియ ఊహించని రేంజ్ కు తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. విష్ణు ప్రియ పర్సనల్ ప్లాట్ ఫామ్ లో పెట్టే కంటెంట్ కోసం ఆమె సబ్స్క్రిప్షన్ ఫీజు రూ. 380 రూపాయలుగా ఉంచారు.


అయితే కేసు ముందు ఈమె పైన విజయవాడ ఏఐఎస్ఎఫ్ వారు ఫిర్యాదు చేయకముందు కేవలం సబ్స్క్రైబర్స్ సంఖ్య 1,892 మంది అంటే అప్పుడు నెలవారి ఆదాయం సుమారుగా రూ .7 లక్షల పైగా ఉన్నది. అయితే కేసు అనంతరం ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి ఎక్కువగా చర్చ జరిగిందో విష్ణు ప్రియ కంటెంట్ చూసే వారి సంఖ్య ఒకసారిగా పెరిగిపోయింది. ఆమె సబ్స్క్రైబర్స్ సంఖ్య 4,832 కి చేరింది అంటే సుమారుగా ఈమె ఆదాయం రూ .18 లక్షల రూపాయలకు పైగానే అన్నట్టుగా వినిపిస్తోంది. ఇలా కేవలం ఈ ఒక్క వివాదం వల్ల ఈమెకు ఇప్పుడు ఏకంగా రూ.11 లక్షల రూపాయల వరకు ఆదాయం పెరిగినట్లు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.



సమాజంలో నైతికతను కాపాడాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విష్ణు ప్రియ మీద కేసు పెట్టారు. డిజిటల్ ప్రపంచంలో ఒక కంటెంట్ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే వాటిని జనాలు అంతగా క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఇప్పుడు విష్ణు ప్రియ పరిస్థితి కూడా అలాగే జరిగింది. మీడియాలో జరిగిన హడావిడి, ఫ్రీ పబ్లిసిటీ వల్ల కొత్తగా సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈ మొత్తం ఊదంతాం వల్ల విష్ణు ప్రియ ఆర్థికంగానే లాభ పడినట్లు పలువురు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: