ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక విషయంలో మొదట రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ‘కాంతార’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు ఈ ప్రాజెక్ట్ కూడా మంచి అవకాశంగా భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, డేట్ల సమస్యల కారణంగా రుక్మిణి వసంత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఇప్పటికే ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ధనుష్ సరసన నటించేందుకు సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సారా అర్జున్ ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఆమెను ఈ చిత్రానికి ఫైనల్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మొత్తానికి, ధనుష్ 56వ చిత్రం ప్రారంభం కాకముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథ, నటీనటులు, దర్శకుడు అన్ని కలిసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి