కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సీక్ . ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ మరి కొంతమంది సెలబ్రిటీలు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను మరింత పెంచేసిందని చెప్పవచ్చు. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైతే జరుగుతోంది.


వాస్తవంగా ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్ లో కూడా ఈ సినిమా రాలేదంటూ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం పైన చిత్ర బృందం తీవ్రంగా ఖండించింది. జూన్ 4వ తేదీన సినిమా రావడం లేదు అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చేస్తున్నామని, చెప్పిన డేట్ కు సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామంటూ తెలియజేశారు.


కేవలం రూమర్స్ నమ్మి అభిమానులు ఆందోళన చెందవద్దని , మరొకవైపు యష్ క్రేజ్ ను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్లే పనిలో పడ్డారు చిత్ర బృందం. అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సినిమాకాన్  ఈవెంట్ కి యష్ హాజరయ్యారు. అక్కడ టాక్సిక్  చిత్రంతో పాటుగా ఆయన నటిస్తున్న మరో చిత్రం రామాయణ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల కోసం సౌత్ సినీ ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: