పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మార్చి 19న విడుదలై మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం బాగానే ఆకట్టుకున్నప్పటికీ కామన్ ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యిందని వినిపిస్తోంది. ఇటీవల ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రిమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ నటుడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పైన కామెంట్స్ చేశారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. పవన్ సినిమాలలో స్క్రీన్ ప్లే దోషాలు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని చిన్న మార్పులు చేసి ఉంటే ఈ సినిమా ఇంకా బాగా ఆడేదేమో అని తన అభిప్రాయంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా అభిమానమని, ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లోకి వెళ్లి చూద్దాం అనుకున్నాను కానీ తనకు ఆరోగ్యం సహకరించలేదు. సినిమా పేరు గంభీరంగా ఉంది.. స్వరాజ్యం సమాజం కోసం పోరాడే వ్యక్తి పేరు పెట్టారు, అయితే సినిమా చూసిన తర్వాత  కథ కథనాలు మెయిన్ పాయింట్ నుంచి పక్కకు వెళ్లిపోయాయేమో అన్నట్టుగా అనిపించిందని, సినిమాలో అనన్యను చంపేయడం కూడా ఒక షాకింగ్ పాయింట్. కానీ ప్రేక్షకులు సీట్లో కూర్చోకముందే ఆ సీన్ వెళ్లిపోయే ప్రమాదం ఉన్నది. ఆ తర్వాత అక్కడ నుంచి రెండు రకాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కథ నడుస్తుంది.


పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కమర్షియాలిటీ జోడించారని పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు కానీ పవన్ కళ్యాణ్ చాలా మందిని కాల్చేయడం చూపించారు. ఈ విషయాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో అన్నట్టుగా తెలిపారు. ఉస్తాద్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు అని చెప్పేలా సెకండ్ హాఫ్ లో ఒక ప్రేమ కథను కూడా జోడించారు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు కనిపిస్తోంది. మొదటి భాగంలో యాక్షన్ పార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి రెండవ భాగంలో పెద్దగా లవ్ సీన్స్ మైనస్ గా మారాయి,మొదటి భాగంలో కూడా కొంత లవ్ స్టోరీని యాడ్ చేసుకోవాల్సింది. అలాగే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు హీరోని చూద్దామా అంటూ ఆలోచిస్తుంటారు కానీ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వరకు పవన్ కళ్యాణ్ కనిపించారు. ఏ సినిమాకైనా హీరో ఎంట్రీ లేట్ అయితే అది సినిమాకే ప్రమాదమని, పార్తిబన్ విలన్ గా ఒప్పించడం కూడా సాహసమే అంటూ తెలిపారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కాస్త రౌడీ ఇన్స్పెక్టర్ ని పోలి ఉంటుంది, ఈ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా మరే పేరైనా పెట్టి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన మరొక లాగా ఉండేదేమో అంటూ పరుచూరి తన అభిప్రాయంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: