టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.అటు తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలలో చేస్తోంది. శృతిహాసన్ కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా పలు చిత్రాలతో తన ప్రతిభను చాటుకుంది..


ఇటివలె మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం కూడా సంచారి అనే పాటను పాడింది. ఈ పాట కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. శృతిహాసన్ సినిమాలలో కంటే లవ్ బ్రేకప్ వంటి విషయాలలోనే ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే రెండుసార్లు ఈమె ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలమయ్యింది. ప్రస్తుతం తాను సింగల్ గానే ఉన్నానంటూ తెలియజేసింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఒక విషయాన్ని తెలియజేసింది.. అస్సాంలో గువాహటిలో నీలాచల్ కొండ పైన ఉన్న కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్నానని తెలిపింది..

వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని, అప్పుడే మనమే కాదు దేవుళ్ళు కూడా మనమల్ని చూసుకుంటారనే నమ్మకం కలిగిందని, ఒక మిత్రుడు సజెషన్ చేయడం వల్లే నేను తన మిత్రుడితో కలిసి ఆ టెంపుల్ కి వెళ్లానని తెలిపింది. అక్కడ ఉన్న దేవాలయం చాలా చిన్నదే అయిన గర్భగుడిలోకి వెళ్ళగానే నిజమైన భక్తిపారవశాన్ని పొందగలిగాను ఎలాంటి ఆడంబరం ఉండదు. వీఐపీల క్యూ లేదు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మవారు చాలా శక్తివంతమైన దేవతగా కనిపించింది అంటూ శృతిహాసన్ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: