సుప్రీత మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో తనమీద పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయని అవి కూడా బాడీ షేమింగ్ గురించి ఎక్కువగా వినిపించేవని దాంతో తాను బరువు తగ్గాలని నిర్ణయాన్ని అప్పుడే తీసుకున్నానని తెలిపింది. అయితే అలా బరువు తగ్గాలని ఆత్రుతతో తాను కొన్ని తప్పులు చేశాను దానివల్ల తాను ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలియజేసింది. స్పీడుగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో తాను కొన్ని కఠినమైన డైట్ ప్రారంభించామని, అందులో భాగంగానే రోజుకి 15 గంటల పాటు ఏమి తినకుండా ఉన్నానని, ఇక తిన్న ఒక్క పూటలో కూడా లైట్ ఫుడ్ కాకుండా బిర్యాని వంటి వాటిని తినేదాన్ని తెలిపింది.
దీంతో తన ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతినింది రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి ,ఆరోగ్యం పూర్తిగా క్షినించడంతో హాస్పిటల్ లో కూడా చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా సుమారుగా 15 రోజులపాటు ఆసుపత్రిలోనే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తీవ్రమైన వాంతులు వల్ల ఆ బాధను తట్టుకోలేకపోయే నన్ను చంపేయండి అని హాస్పిటల్ సిబ్బందిని కూడా వేడుకున్న సందర్భాలు ఉన్నాయని చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. చివరికి కోలుకొని సాధారణ స్థితికి వచ్చారని ఇప్పుడు తాను హ్యాపీగా ఉన్నానంటే తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి