టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇటీవల తన చిరకాల ప్రేయసి రష్మిక మందన్నతో ఏడడుగులు వేసి కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అలా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన అనే సినిమా చేస్తున్నారు.  ఇందులో విజయ్ దేవరకొండ సరసన మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది.  గాయపడిన మనిషి జీవిత చరిత్రగా రాబోతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల నుండి రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ ,తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారట. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే క్రిస్టో జేవియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. ఇప్పుడు తాజాగా టాక్సిక్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా ఇందులో భాగమయ్యారు. ఈ ఇద్దరి కాంబోతో ఈ సినిమాలో బిజిఎం సాంగ్స్ అదిరిపోయే అవకాశం ఉందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు పనిచేయబోతున్నారని తెలియడంతో అభిమానులు,  సినీ ప్రేక్షకులు ఈ సినిమా మ్యూజిక్ పాటల కోసం తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ థియేటర్లలో ఇటు సోషల్ మీడియాలో ఏ విధంగా సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: