నమిత తమిళ బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొన్నది. హౌస్ లో రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయని మొదటిది తమ సహజ స్వభావంతో ఉండడం అయితే దీనికి అవమానాలు, నిందలు, కించపరచడం వంటివి జరుగుతాయి. వాటన్నిటికి సిద్ధంగానే ఉండాలి మరొక మార్గం చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో వాటిని అందించడం. 90 రోజులపాటు నిరంతరం నటించడం, ఏడుస్తూ ప్రజల సానుభూతి పొందడం, డాన్స్ వంటివి చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకోవడం చేస్తూ నిజాయితీగా ఉంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు అని ఆమె వివరించింది.
తన విషయానికి వస్తే మాత్రం తన స్నేహితులు లేదా ప్రజలను ఎవరైనా సరే వేధించినప్పుడు తాను తనకోసం మాత్రమే కాకుండా వారందరి కోసం కూడా నిలబడతానంటూ ఆమె ధైర్యంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఎదుర్కొన్న విమర్శల పైన స్పందిస్తూ.. మొదట్లో తన సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తన భర్త ఇంస్టాగ్రామ్ కామెంట్లను బ్లాక్ చేశారని, కానీ తాను తప్పు చేయనప్పుడు ఇతరుల దూషణలను భరించడం కష్టమని కూడా తెలియజేసింది. దీంతో ఎంతోమందికి వివరించడానికి ప్రయత్నించగా కొందరు అర్థం చేసుకున్నారు మరి కొంతమంది అర్థం చేసుకోలేకపోయారంటూ తెలిపింది. చాలామందికి నీచంగా అసభ్యకరంగా కామెంట్స్ చేసేవారు. మీ కుటుంబం నాశనం అయిపోవాలనీ , మీ తల్లి మరణించాలి అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అవి చదివేటప్పుడు చాలా ఏడ్చేసానని తెలియజేసింది నమిత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి