టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఇప్పటికే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్లకు మించిన కలెక్షన్ లు వచ్చాయి. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక ఇప్పటికి కూడా సక్సెస్ ఫుల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఏప్రిల్ 26 వ తేదీ నుండి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... ఇందులో ఈమె తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... డీజె టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టిమూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తక్కువ సమయమే కనిపించినప్పటికీ ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: