ఈ మధ్య నటీమణులు సొంత గొంతును సినిమాల్లో వినిపించాలని ముచ్చట పడుతూ ముందుకొస్తున్నారు. ఆ మధ్య నయనతార అలానే ముందుకొచ్చింది. ఆ తరువాత సమంత కూడా సిద్ధమైంది, కానీ... ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ఇటీవలే ‘మిర్చి’ కోసం అనుష్క కూడా డబ్బింగ్ చెబుతుందని వార్తలు వెలువడ్డాయి. ఈ పరంపరలోనే ఇప్పుడు అమలాపాల్ కూడా చేరబోతోంది.
తనకి తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని అమలాపాల్ చెబుతోంది. ‘నా పాత్రలకి నేను డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. అయితే, ఇప్పుడిప్పుడిప్పుడే తెలుగు కొంచెం కొంచెంగా అర్థమౌతోంది. ప్రస్తుతం తెలుగు బాగా నేర్చుకోవడంపై శ్రద్ధపెట్టాను. నేను తెలుగులు డైలాగులను అర్థం చేసుకుని చెప్పగలను అని నమ్మకం కుదరగానే వెంటనే డబ్బింగ్ చెప్తాను’ అంది.
మరింత సమాచారం తెలుసుకోండి: