ఘంటసాల వేంకటేశ్వరరావు తెలుగు పాట ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనుడు. కాగా, అదను చూసి వాత పెట్టడంలో కూడా ఘంటసాల సిద్ధహస్తుడు అనే విషయం పరిశ్రమలో కొంది మందికే తెలుసు.
నటుడు కాంతారావు 1969 లో ‘సప్త స్వరాలు’ అనే జానపద చిత్రాన్ని నిర్మించారు. అందులో ‘హాయిగా పాడనా’ అనే గీతం ఉంటుంది. ఇదీ కాంతారావు, సత్యనారాయణ మధ్య సాగే పోటీ గీతంగా చిత్రంలో కనిపిస్తుంది. ముందుగా ఈ పాటను ఘంసాల, వేరో గాయకుడు చేత పాడాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ పాటను కొత్తవారితో పాడిస్తే బావుంటుందని, బొంబాయికి చెందిన గాయకులు చేత పాడిస్తే బావుంటుందని కాంతారావు, సంగీత దర్శకుడు టి.వి.రాజు నిర్ణయించారు.
దీనికి కోసం బొంబాయి వెళ్లి మన్నాడేనీ, హేమంత్ కుమార్ ని సంప్రదించారు. అయితే వారు వారం రోజులపాటు వేచి చూసేలా చేసి తరువాత మేం పాడమని కాంతారావుకు చెప్పారు. దీంతో మళ్లీ ఘంటసాల వద్దకు వచ్చారు కాంతారావు.
తనను కాదనుకుని ముంబయి వెళ్లిన కాంతారావుకు పాఠం చెప్పాలని ఘంటసాల భావించారు. పాడతానని కాంతారావుకు చెబుతూనే ‘ముందుగా నన్ను అనుకుని, తర్వాత కాదనుకుని తరువాత మళ్లీ నా దగ్గరకే వచ్చారు గనుక, నేను పాటకు 300 తీసుకునే వాడని, అయితే ఈ పాటకు 500 తీసుకుంటానని’ అని అన్నారు. దీంతో కాంతారావు బదులు మాట్లాడలేక పోయారు. 500 రూపాయిలు చెల్లించడానికి అంగీకరించారు.
చివరికి ఈ పాటను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ పాడారు. ‘హాయిగా పాడనా..’ పాట మంచి హిట్టయ్యింది.
మరింత సమాచారం తెలుసుకోండి: