రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజుకు ముందు ఎంతో ఆర్భాటంగా.... తుఫాన్ టీజ‌ర్ల‌ను విడుద‌ల చేశారు. తెలుగులో ఆ సినిమాని భారీ ఎత్తున మార్కెట్ చేసుకొందామ‌ని నిర్మాత‌లు భావించారు. క‌నీసం తెలుగు హ‌క్కుల కింద రూ.40 కోట్లు వ‌స్తాయ‌ని లెక్క‌లు వేసుకొన్నారు. కానీ.. ఇక్క‌డి నిర్మాత‌ల నుంచి ఏమాత్రం స్పంద‌న లేదు. ఈ సినిమాకి రూ. 40 కోట్లు మ‌హా ఎక్కువ‌ని ఆ డ‌బ్బుతో ఓ స్టార్ హీరోతో సినిమా తీసుకోవ‌చ్చ‌నేది వాళ్ల ఉద్దేశ్యం. రిల‌య‌న్స్ మాత్రం.... ఒక్క రూపాయి కూడా త‌గ్గించ‌డం లేదు. రూ.30కి అమ్మితే కొనుక్కొందామ‌ని... కొంత‌మంది నిర్మాత‌లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా.. ఆ రేటుకి ద‌క్క‌లేదు. దాంతో లైట్ తీసుకొన్నారు. సంజ‌య్ ద‌త్ జైలు శిక్ష ఖ‌రార‌వ్వ‌డం, ఈ సినిమానుంచి అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ప్పుకోవ‌డంతో తుఫాన్‌పై జ‌నాల‌కు ఉన్న క్రేజ్ త‌గ్గిపోవ‌డం ప్రారంభించింది. ఇప్పుడు 30కి అమ్మ‌తాన‌న్నా కొనేవాళ్లే క‌ర‌వ‌య్యారు. అలా విజృంభిస్తుంద‌నుకొన్న తుఫాన్... తీరం దాట‌క ముందే చ‌ప్ప‌బ‌డిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: