పవన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినా నిర్మాత మాత్రం సేఫ్ జోన్ లో ఉంటాడు. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాల కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో ఉంటాయన్నది పలువురు ఒప్పుకునే నిజం. యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అలాంటిది మరి. తొలిప్రేమ, ఖుషి, బద్రి నుంచి నిన్నటి గబ్బర్ సింగ్ దాకా ఆయనకు హిట్లు చాలానే ఉన్నాయి. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు రూ.15కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. మన భాషరాని, డబ్బింగ్ చెప్పుకోవడం చేతకాని పొరుగు హీరో సూర్యకే మురుగదాస్ తో చేయబోతున్న సినిమాకు దాదాపు ఇంతే పారితోషికం ఇవ్వబోతున్నారని సమాచారం. అలాంటప్పడు తెలుగు హీరోకు తెలుగు నిర్మాతలు అంత పారితోషికాన్ని ఇస్తే తప్పేంటి? సినిమా బడ్జెట్ పెరిగిపోతోందని మండలిలో సమావేశం వేసుకుంటున్న సదరు నిర్మాతలు పొరుగు వారికి ఇచ్చే పారితోషికాన్ని పట్టించుకోకుండా తెలుగు వారికి ఇచ్చే పారితోషికం గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం. 

మరింత సమాచారం తెలుసుకోండి: