ఇప్పటికింకా నా వయసు పాటను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ పాటను మర్చిపోనప్పుడు ముమైత్ ను ఎలా మర్చిపోతారు? ముమైత్ ఖాన్ ను తెలుగులో పాపులర్ చేసిన ఘనత పూరి జగన్నాథ్ దే. సినిమా అంటే సన్నివేశాలతో పాటు తప్పకుండా ఐటెమ్ సాంగ్ ఉండాలన్న ట్రెండ్ ముమైత్ ను చూసి మళ్ళీ మొదలైంది. సినిమా తీసే నిర్మాతలు హీరోహీరోయిన్లను అనుకున్నంత స్పష్టంగా ముమైత్ కాల్షీట్ల కోసం ఎదురుచూసేవారు. అంతగా ఊపు ఊపిన ముమైత్ తన కాలిగోటికి వేసుకునే పాలిష్ కూడా తెలుగు పరిశ్రమ పెట్టిన భిక్షేనని పలుమార్లు చెప్పుకుంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఓ సినిమా నిర్మించాలని అనుకుంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తారు.
మరింత సమాచారం తెలుసుకోండి: