ఇటీవలే విడుదలైన అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, లావణ్య త్రిపాఠికి మరో గోల్డెన్ చాన్సు తగిలింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో ఒక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఎంపిక అయ్యింది. కాగా, సినిమాలో ప్రధాన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. శోభు యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ కధాంశంతో రూపొందుతుంది.  కాగా, తనకు రెండవ సినిమాతోనే రాజమౌళి చిత్రంలో చాన్సు రావడంతో లావణ్య త్రిపాఠి చాలా ఆనందంతో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: