రామ్ చరణ్ తో మగధీర వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది కాజల్. వీరద్దరి జోడికి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. కాగా, మళ్లీ రామ్ చరణ్ తో నాయక్ సినిమాలో నటిస్తోంది కాజల్. అలాగే, ఈ సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ’శుభలేఖ రాసుకున్న..’ ను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ రీమిక్స్ ను మొదటగా కాజల్, చరణ్ మీదే చిత్రీకరించాలని భావించారు. అయితే కాజల్ డేట్స్ ఎడ్జట్స్ కాకపోవడంతో సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోన్న అమలాపాల్ మీద చిత్రీకరించడానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని కాజల్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఇప్పడు కాజల్ తెగ వర్రీ అవుతుందట. చరణ్ సినిమాలలో రీమిక్స్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, రచ్చ సినిమాలో వానా వాన.. పాటతో తమన్నా మంచి మార్కులు వేయించుకుందని సన్నిహితులు కాజల్ కు నూరి పోస్తున్నారట. రేపు నాయక్ విడుదల అయ్యాక కూడా అందరూ అమలాపాల్ గురించే మాట్లాడుకుంటారని సన్నిహితులు హెచ్చరిస్తుంటే కాజల్ తెగ కంగారు పడుతుందట.
మరింత సమాచారం తెలుసుకోండి: