ఇటీవల వచ్చిన తూనీగ.. తూనీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సమంత్ అశ్విన్. ఈ పాలబుగ్గల కుర్రాడు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు అన్న విషయం తెలిసిందే.
ఈ తూనీగ తూనీగ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సుమంత్ అశ్విన్ నటన సినీ అభిమానులను ఆకట్టుకుంది. కాగా, సుమంత్ అశ్విన్ రెండవ సినిమా త్వరలో మొదలు కానుంది.
అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్ సినిమాలతో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
అలా మొదలైంది సినిమాను నిర్మించిన దామోదర్ ప్రసాద్ ఈ సుమంత్ అశ్విన్, ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి