తన అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న ఢిల్లీ ముద్దగుమ్మ శ్రియ శరణ్ ప్రస్తుతం రూపా నాయర్ దర్శకత్వంలో చంద్ర అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రియ రాజకుమారిగా నటిస్తోంది.
కాగా, ఎప్పుడూ వెండితెర మీద అందాలను ఆరబోసే శ్రియా ఈ సినిమాలో కత్తి ఫైట్లు చేస్తోంది. ఈ సినిమా కోసం సుకుమారి శ్రియ కష్ట పడి కొన్ని యుద్ద విద్యలు నేర్చుకుందని చంద్ర యూనిట్ అంటుంది.
కాగా, ఈ చంద్ర సినిమా తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల కానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: