బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పడు తెలుగులో బిజీగా మారాడు. అయితే బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాడు. కాగా, తాజాగా బాలీవుడ్ లో అతనికి ఒక మంచి చాన్సు దక్కింది. వాంటెడ్, రౌడీ రాథోడ్ సినిమాలతో బాలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా ఇప్పడు శృతిహసన్ హీరోయిన్ గా మరొక హిందీ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు సూపర్ హిట్టయిన నువ్వస్తానంటే నేనొద్దంటానాను ఇప్పడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు మాతృకలో హీరోయిన్ అన్నయ్యగా శ్రీహరి పోషించిన పాత్రను సోనూసూద్ కు ఇచ్చాడు. ఈ సినిమా బాలీవుడ్ లో తనకు మంచి గుర్తింపు తీసుకుని వస్తుందని సోనూసూద్ చాలా ధీమాగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: