మహాత్మ, దరువు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన విజయ్ అంటోని త్వరలో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కానున్నాడు. తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘నాన్’ చిత్రాన్నీ ‘నకిలీ’ పేరుతో తెలుగులోకి ఫాంటసీ ఫిలిం ఫార్మర్స్ సంస్థ అనువదిస్తోంది. ఈ సంస్థ లోగోను, టైటిల్ లోగో ను ప్రముఖ హీరో సూర్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ‘సంగీత దర్శకుడిగా అద్భుతమైన హిట్లు సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని హీరోగాను రాణించాలని’ ఆకాంక్షించారు.
చిత్ర హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘ ఈ ‘నకిలీ’ సినిమా సంగీత దర్శకుడిగా తనకు 25వ చిత్రమని, తమిళంలో విజయవంతమైన ఈ సినిమాను తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే’ నమ్మకాన్ని వెల్లడించారు.
చిత్ర అనువాద కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే నకిలీ ఆడియోను విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు రాజశేఖర్, చినబాబు అరిగెల తెలిపారు.
కాగా, ఈ నకిలీ సినిమాకు కథ,ఫోటోగ్రఫీ, దర్శకత్వాన్ని జీవాశంకర్ సమకూర్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: