తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీయల్ హీరోలు కంటే రీల్ హీరోల శాతమే ఎక్కువ. అయితే అందులోనూ రియల్ హీరోలం మేమున్నామంటూ అప్పుడప్పుడు కొంత మంది హీరోలు నిరూపించి మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తనని కలవడానికి టైమ్ కుదరదంటూ సినీతారలు కుంటి సాకులు చెబుతున్న ఈ రోజుల్లో ఆపదలో వున్న వారికోసం మేమున్నామంటూ అనాధల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలకే కాదు. ఆపదలో వున్నవారిని, అభాగ్యులను ఆదుకొని ఆపన్న హస్తం అందించడంలో మేము సైతం అంటున్నారు మన క్రేజీ హీరోలు. మొన్నటికి మొన్న నటి పావలా శ్యామల తన కూతురి వైద్యం కోసం అష్ట కష్టాలు పడుతుంటే ఆ వషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అపోలో హస్పటల్ సిబ్బందికి స్వయంగా ఫోన్ చేసి పావల శ్యామల కూతురి వైద్యనికి ఎంత ఖర్చయినా సరే నేను భరిస్తాన్నని చెప్పి, ఆమాట నిలబెట్టుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. అతన్ని ఆదర్శంగా తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనాధబాలల కష్టనష్టాలు తెలుసుకుని ఆర్ధిక సహయం చేయడానికి ముందుకొచ్చాడు. సల్గొండలోని ఓ అనాధబాలల కోసం ఏకంగా 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించిన ప్రభాస్ వారితో కొంత గడిపి వారిలో నూతనోత్తేజాన్ని నింపాడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: