బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ లేటు వయసులో పెళ్లి చేసుకోవాలని తెగ ముచ్చటపడుతోంది. ఇన్నాళ్లు పెళ్లి వద్దంటూ ఒంటరిగానే ఉన్న సుస్మితాకు ఇప్పుడు 36 ఏళ్ల వయసులో మ్యారేజ్ లైఫ్ పై మోజు కలిగినట్లుంది. పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది.
సుస్మితా 36 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటోంది. సహా హీరోయిన్లంతా మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టగా.. సుస్మితాసేన్ మాత్రం ఇప్పటికీ లవ్ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్లకు మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టలనుకుంటున్నానని.. బహుశా వచ్చే ఏడాది జరగవచ్చని సుస్మితాసేన్ తెలిపింది. పొడవాటి గౌను వేసుకుని రాజకుమారిలా క్రైస్తవ పద్దతిలో మ్యారేజ్ చేసుకోవాలని ఉందని తెలిపింది. తన తండ్రి కోరిక మేరకు తను భారతీయ సాంప్రదాయ వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పింది. అయితే వరుడు ఎవరనే విషయం మాత్రం సుస్మిత చెప్పడం లేదు.
ఈ భామ గతంలో జోరుగా ఎఫైర్స్ తో వార్తల్లోకి ఎక్కింది. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో డేటింగ్ చేసింది. ఆ తర్వాత యాడ్ మేకర్ మానవ్ మీనన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ పైన బంటీ సచ్దేవ్తో కాలక్షేపం చేసిన సుస్మితా.. ఆ తర్వాత పాకిస్థాన్ పేసర్ వసీమ్ అక్రమ్‌తో కూడా ఎఫైర్ ఉన్నట్టు టాక్ వినిపించింది. సుస్మిత అనాథ పిల్లలను దత్తత తీసుకుని పోషిస్తోంది. మరి సుస్మిత తన పెళ్లి చేసుకుని ఎంత మందిని కంటుందో చూడాలంటున్నారు బాలీవుడ్ జనాలు.
మరింత సమాచారం తెలుసుకోండి: