హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మరోసారి అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో ఉల్లంఘనలకు కళ్లెం పడుతుందని ఇద్దరు సభ్యులు డారెల్ ఇసా, స్కాట్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నారు.హెచ్1బీ వీసా ఉన్నవారికి వారిక వేతనం కనీసం 10 లక్షల డాలర్లకు పెంచడం, మాస్టర్ డిగ్రీ మినహాయింపు రద్దు చే