కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా మంది ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నారు. కోపం మనిషిని నైతికంగా చంపేస్తుందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఒమన్‌లోని సాల్లలహ్ ప్రావినెన్స్‌‌లో ఒక భారతీయ మహిళ ఒక వ్యక్తిని చంపేసింది. అతడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. కొద్దిసంవత్సరాల క్రితం ఆమె ఉపాధికోసం ఒమన్‌కు వలసవచ్చింది. తనకు పరిచయమైన ఆ భారతీయ వ్యక్తితో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. ఆమె, అతనితోనే సాల్లలహ్ ప్రావినెన్స్‌లో నివాసం ఉంటోంది. అయితే వారి మధ్య అప్పుడప్పడూ గొడవలు జరుగుతుండేవని పక్కింటివారు చెబుతున్నారు.



అలాగే మంగళవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగిందని, అంతేకాక అతడు, ఆమెను అప్పుడప్పుడూ కొట్టేవాడని కూడా వారు తెలిపారు. అయితే కొద్దిరోజులుగా ఆమె వాటిని భరిస్తూ వస్తోంది. మంగళవారం మాత్రం ఆమె తన కోపాన్ని అణచుకోలేకపోయింది. వారి మధ్య గొడవ మొదలైన కొద్దిసేపటికే తుపాకీతో అతడిపై కాల్పులు జరిపింది. ముందుస్తు ప్రణాళికలో భాగంగానే ఆమె తుపాకీ కొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. కాల్పులు శబ్ధం విన్న పక్కింటి వారు అతడిని, సుల్తాన్ కుతుబ్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం అతడు మరణించడని పోలీసులు తెలిపారు. అయితే బుధవారం ఉదయమే నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: