టీపాడ్ (తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) ఆధ్వర్యంలో అమెరికాలో వనభోజనాల ఏర్పాటు చేస్తున్నట్టుగా టీపాడ్ తెలిపింది. ఓ శ్రీర్షికతో కూడిన ప్రతిని విడుదల చేసింది. స్వచ్చమైన గాలిని, అచ్చమైన  పచ్చదనాన్ని తనివితీరా ఆస్వాదించి , ఆత్మీయ అనురాగాలతో, సుఖసంతోషాలతో, భందు మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటూ మవములో సంబరం అంబరాన్ని తాకేలా చేసే భోజనమే వన భోజనం అంటూ ఆత్మీయ ఆహ్వానం తన సంస్థ సభ్యులకి అందించింది.  

 Image result for telangana people's association of dallas

టీపాడ్ ఏర్పాటు చేసే ఈ వనభోజనాల ప్రకటన పత్రిక అందరిని ఆకట్టుకుంది. జూన్ 15 శనివారం, ఉదయం 11 గంటల మొదలు సాయంత్రం 6 గంటల వరకూ పైలట్ క్నోల్ పార్క్ లో వనభోజనాలు జరుగుతాయని టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు సరదాగా గడిపేలా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

 TPAD to celebrate summer picnic in Dallas on June 15th-TNILIVE TPAD Dallas

కబడ్డీ, కోకో, వాలీబాల్, క్రికెట్, కిడ్స్ పెయింటింగ్ , అంతాక్షరి, తొక్కుడు బిళ్ళ, కైట్ ఫ్లైయింగ్ బోట్ రైడింగ్ వంటి అనేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని అందరూ ఉశ్చాహంగా పాల్గోనచ్చని తెలిపారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని ప్రకటనలో తెలిపారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: