నలుగురు సభ్యులు ముఠా గా చేరి ఎన్నారైల కి వల వేసి వారి నుంచీ లక్షల కొద్దీ డబ్బు కాజేయడం అలవాటుగా చేసుకున్నారు. వీరి భారిన పడిన ఎన్నారైలు  లెక్కకి మించే ఉన్నారు. అయితే ఎన్నారై లని ఆకర్షించడానికి ఆ గ్రూపు లో కేరళకి చెందిన మహిళా కూడా ఉంది. ఆమె ద్వారా ఎన్నారైలని ఆకర్షించి డబ్బులు దండుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఖత్తర్ లో ఉన్న ఒక ఎన్నారై కి అందరికి పరిచయం అయినట్టుగానే ఫేస్ బుక్ ద్వారా ఆమె పరిచయం అయ్యింది. మాట మాట కలపడంతో పాటు చనువు బాగా పెంచుకుంది. దాంతో అతడిని ఖత్తర్ లో ఆమె ఉంటున్న ఫ్లాట్ కి పిలిచింది. దాంతో

 

ఎన్నారై ఆమె ఉంటున్న  ప్లాట్ కి వెళ్ళాడు.  ముందుగానే ఆమె గదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నారై నగ్నంగా ఉన్న ఫోటోలని వీడియోలని తీశారు. ఆ తరువాత వాటిని సదరు వ్యక్తిని పంపి డబ్బులు డిమాండ్ చేశారు. 50 లక్షలు ఇవ్వకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. దాంతో కంగారు పడిన అతడు తన మిత్రుడి సలహాతో కొచ్చి లోని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దాంతో కేరళ పోలీసులు ఖత్తర్ లో ఉన్న అధికారుల సాయంతో ఆ ముఠా సభ్యులు, మహిళ వివరాలు తెలుసుకున్నారు.

 

పక్కా పధకం ప్రకారం వారు చెప్పిన ఎకౌంటు లో డబ్బులు జమచేశారు. జమ చేయగానే కేరళలోని కన్నూర్ జిల్లాకి చెందిన ఓ ప్రాంతంలోని ATM నుంచీ డబ్బులు తీయగా ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఖత్తర్ లో ఉన్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఖత్తర్ పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ ముఠా ఎంతో మంది ఎన్నారైలని మోసం చేసిందని అందరూ భయపడి భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారని విచారణలో తేలినట్లు కొచ్చి పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: