కష్టం వచ్చినపుడే బుర్ర పదునెక్కుతుంది, ఆలోచనల నుంచీ ఐడియాలు పుడతాయి. దెబ్బలు తగిలితేనే రాటు దేలుతారు. ఏంటి వరుసగా నీటి సూక్తులు చెప్తున్నాము అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే. ఓ రైతుకు పెద్ద కష్ట వచ్చింది. తాను ఎంతో కష్టపడి పంటలు పండించి చేతికి పంట వచ్చే సమయంలో కోతులు, ఇతర జంతువులు పంట నాశనం చేస్తున్నాయి. పైగా దొంగలు రాత్రి సమయంలో వచ్చి దోచేస్తున్నారు ఈ పరిస్థితుల నుండీ ఎలా బయటపడాలో అంటూ ఆలోచన చేసిన ఓ రైతుకి సూపర్  ఆలోచన వచ్చింది. అది కాస్తా అమలులో పెట్టాడు దేశ వ్యాప్తంగా అతడి ఐడియా వైరల్ అవుతోంది. వివరాలోకి వెళ్తే..

 

కర్ణాటక లోని మాల్నాడ్ ప్రాంతంలోని శివమోగ్గ గ్రామంలో శ్రీకాంత్ గౌడ్ అనే రైతు ఉన్నాడు. అతడి పంటని రోజు కోతులు పాడు చేస్తున్నాయి. దాంతో ఏమి చేయాలో తెలియక, లేచింది మొదలు పడుకునే వారకూ పొలంలో కాపలా ఉండలేక ఆలోచనలో పడిన రైతుకి గతంలో ఓ రైతు తన పొలంలో కాపలా కోసం చేసిన ప్రయత్నం తెలిసింది. వెంటనే తన పెంపుడు కుక్కని తీసుకు వచ్చి..

 

కుక్క కి అచ్చం పులిలా ఉండేలా పెయింట్ వేశాడు. అంతేకాదు రెండు మూడు పులి లాంటి బొమ్మలు తీసుకువచ్చి పొలంలో పెట్టాడు. దాంతో అప్పటి నుంచీ ఆ కుక్క పొలంలో కోతుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది పులి అనుకుని కోతులు పారిపోతున్నాయట. అంతేకాదు దొంగలు సైతం కొన్ని సందర్భాలో పులి అని అరుచుకుంటూ పారిపోయిన సంఘటనలు కూడా జరిగాయని అంటున్నాడు ఆ రైతు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది రైతులు ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: