71 ఏళ్ళ వయసులో ఓ వృద్దుడిని అరెస్ట్ చేశారు జపాన్ పోలీసులు..అయ్యో పాపం 71 ఏళ్ళ వృద్దుడిని అరెస్ట్ చేయడం ఏమిటి వాళ్లకి మాయరోగామా అనుకోకండి. వాళ్ళు అరెస్ట్ చేయడానికి అసలు కారణం తెలుస్తే మీరు కూడా తప్పులేదు అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే. మనకి సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రాకపోతే ఏమి చేస్తాం కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి సమస్య అడిగి తెలుసుకుని పరిష్కారం వెదుకుతాం. అయితే

Image result for 71 years old men <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ARREST' target='_blank' title='arrest-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>arrest</a> in japan

జపాన్ లోని టోక్యో లో ఉండే ఓ వృద్దుడు కూడా అదే పనిచేశాడు అరెస్ట్ అయ్యాడు. అదేంటి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అనుకోకండి. ఆయన గారు కస్టమర్ కేర్ కి దాదాపు 24 వేల సార్లు ఫోన్ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కంపెనీ పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించింది. ఇంకా అర్థం కాలేదా సరే మ్యాటర్ లోకి వెల్లిపోదాం..

 

ఆ 71 ఏళ్ళ ముసలాయన పేరు అకితోషి ఒకామో. ఈ వృద్దుడు కేడీడీఐ అనే టెలికం కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కి 24 వేల సార్లు ఫోన్ చేసి కంపెనీ తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టాడట. అంతేకాదు కంపెనీ యాజమాన్యం తన వద్దకి వచ్చి మరీ క్షమాపణ చెప్పాలని హుకుం జారీ చేశాడట. దాంతో మండిపడ్డ కంపెనీ సదరు తాత పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేసిన పోలీసులు తాతని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారట. పాపం 71 ఏళ్ళ వయసులో ఎంత కష్టం వచ్చిందో అంటూ సోషల్ మీడియాలో ప్రజలు తాతకి సానుభూతి  తెలుపుతున్నారు. ఇది అసలు విషయం

 

మరింత సమాచారం తెలుసుకోండి: