ట్రంప్ పదవీచ్యుతుడు అవడానికి ఎంతో సమయం లేదని అంటోంది ప్రపంచ మీడియా. ట్రంప్ పై ప్రవేశ పెట్టిన అభిశంసనలో ట్రంప్ కి వ్యతిరేకంగా సుమారు 229 ఓట్లు పోలయ్యాయని, పోలయిన ఓట్లు అన్నీ డెమోక్రటిక్ పార్టీ నేతలదేనని తెలుస్తోంది. ఇదిలాఉంటే ట్రంప్ కి అనుకూలంగా 195 మంది సొంత పార్టీ అయిన రిపబ్లికన్స్ ఓట్లు వేశారు. ఇదిలాఉంటే అభిశంసన జరిగి ట్రంప్ గద్దె దిగితే అమెరికా చరిత్రలోనే

 

అభిశంసనకి గురయిన మూడో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుతానికి ప్రతినిధుల సభలో అభిశంసన అయిన రిపోర్ట్ త్వరలోనే సెనేట్ కి చేరుతుందని ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగాలా లేదా అనేది ఇక సెనేట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ట్రంప్ తనపదవిని పోగొట్టుకునేలా దారి తీసిన పరిస్థితులుని ఒక్క సారి పరిశీలిస్తే.

 

ట్రంప్ తన ప్రత్యర్ధి అయిన డెమోక్రటి పార్టీ నేత జో బిడెన్ పై అవినీతి ఆరోపణలు చేపట్టి విచారణ చేయాలని ఉక్రెయిన్ ని ఒత్తిడి చేసి , ఆ దేశాన్ని తనకి రాజకీయంగా సాయం చేయమని కోరిన అంశం అభిశంసన లో కీలకమైన ప్రవేశపెట్టారు. అలాగే ప్రతినిధుల సభ విచారణకి ట్రంప్ రాలేదని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ ని ఆయన అడ్డుకున్నారని మరొక అభియోగం మోపారు. అంతేకాదు ఎంతో గౌరవ ప్రదంగా ఉన్న అమెరికా దేశ పరువుని బజారుకీడ్చారని, ఒకరకంగా ఇది దేశ ద్రోహంవంటిదని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ట్రంప్ పై సెనేట్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. మరి ట్రంప్ ఉంటాడో ఊడిపోతాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: