అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే గ్రీన్ కార్డ్ తప్పని సరి అనే విషయం ప్రతీ వలస వాసులకి తెలిసిందే. అంతేకాదు ఈ గ్రీన్ కార్డ్ కోసం లక్షలాది మంది వలస వాసులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే. అయితే ఈ సంఖ్య 2030 నాటికి మరింత రెట్టింపు అవుతుందని భారతీయులు దశాభ్దాల పాటు గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షించాల్సి వస్తుందని అంటోంది సిఆర్ఎస్.

IHG

కాంగ్రేషనల్ రీసర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం. ఇప్పటి వారకూ గ్రీన్ కార్డ్ ఆమోదం పొంది వేచి ఉన్న వారి సంఖ్య ఇప్పటికే 10 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం మూడేళ్ళ కి ఒక్కో దెఅ పరిమితిని తొలిగించి విదేశీ నిపుణులకి గ్రీన్ కార్డ్ రిజర్వ్ చేసి ఉంచుతారు. ఈ క్రమంలోనే ఉపాధి ఆధారంగా ఈబీ -1 ఈబీ -2 , ఈబీ -3 వర్గాలకి జరీ చేసే గ్రీన్ కార్డ్ ల సంఖ్య ని 1,20,120 కి పెంచారు.  అయితే

IHG

తాజాగా సవరించిన చట్టాల ప్రకారం భారత్ చైనాకి కాల పరిమితి  తగ్గనుంది. దాంతో ఈబీ1 బ్యాక్ లాగ్ సంఖ్య 1,19,732 నుంచీ ,2,68,246కి పెరగనుంది అయితే ఇది 2030 కి  జరగనున్న ప్రక్రియ. ఇక ఈబీ2 వారి సంఖ్య 6,27,448 నుంచీ 14,71,360 కు అలాగే ఈబీ3 వారి సంఖ్య 1,68,317 నుంచీ 4,56,190 కి పెరగనుంది. ఈ మూడు వర్గాల వారి సంఖ్య 2030 నాటికి భారీగా పెరగనుందని అంటున్నారు నిపుణులు. ఈ లెక్కల పరంగా చూస్తే గ్రీన్ కార్డ్ పొందటం భారతీయులకి దశాభ్దా కాలం పట్టడం ఖాయమని అంటోంది సిఆర్ఎస్.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: