ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ అమలుతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. మద్యానికి అలవాటు పడిన కొందరు మద్యం అందుబాటులో లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. 
 
మరికొందరు మద్యం దొరక్కపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు మద్యం దొరక్క చనిపోతున్న కేసులు పెరిగిపోతూ ఉండటంతో దుబాయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మద్యం డోర్ డెలివరీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గడంతో ఆదాయ లోటును భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నిర్ణయం ద్వారా అక్రమ మద్యాన్ని అరికట్టడంతో పాటు... లాక్ డౌన్ ద్వారా ఏర్పడిన లోటును భర్తీ చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి చెందిన మారిటైమ్ అండ్ మర్కంటైల్ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ ఈస్టర్న్ సంస్థలు వెబ్ సైట్ ద్వారా ఆర్డర్లు తీసుకొని వారికి డోర్ డెలివరీ చేయనున్నారు. విదేశీయులు పాస్ పోర్ట్ ను ఆధారంగా చూపించి మద్యం కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 21 ఏళ్లు నిండిన ముస్లిమేతరులకు పోలీసులు ఇచ్చే ఆల్కహాల్ లైసెన్స్ ఉంటే మాత్రమే ప్రభుత్వం మద్యం సరఫరా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: