కరోనా ధాటికి పెద్దన్న అమెరికా చేతులు ఎత్తేసింది. తమని ఏమి చేయదని విర్రవీగిన ట్రంప్ ఓవర్ కాన్ఫిడెంట్ పై ఒక్క దెబ్బ కొట్టింది. ఫలితంగా అమెరికా వాప్తంగా ఇప్పటి వరకూ 47వేల మంది మృతి చెందగా దాదాపు 8.50 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటికీ ఎంతో మంది చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఈ ప్రభావంతో ఎంతో మంది  ఉద్యోగాలు పోగొట్టుకుని నిరుద్యోగ సమస్యతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులని గాడిలో పెట్టేందుకు ట్రంప్ వలస వాసుల వీసాలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

IHG

భారతీయ విద్యార్ధులు తో పాటు ఇతర దేశాల నుంచీ వచ్చి ఉంటున్న విదేశీయులపై ప్రభావం చూపించే విధంగా గ్రీన్ కార్డ్ కోటాపై ఎసరు పెట్టారు. 60 రోజుల పాటు వీటిని ఆపేస్తూ ఈరోజు అంటే గురువారం సంతకం పెట్టనున్నారు. అమెరికాలో ఎంతో మంది ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు..వారిని ఆడుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు...అయితే 60 రోజుల తరువాత ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు..

IHG

ఇదిలాఉంటే..ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అమెరికాలో స్థిరపడాలని గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. పస్తుత లెక్కల ప్రకారం చూస్తే అమెరికా ప్రతీ ఏడాది 1.5 లక్షల గ్రీన్ కార్డ్ లు జారీచేస్తోంది..వివిధ రకాలుగా 5083 మంది  భారతీయులకి జారీ అయ్యాయి. కాబట్టి ఈ ప్రభావం కేవలం గ్రీన్ కార్డ్ వారిపై మాత్రమే ఉంటుందని. హెచ్ 1 – బీ కోరుకునే వారు ఎప్పటిలా అమెరికా రావచ్చని సంకేతాలు ఇచ్చారు. అయితే 60రోజుల తరువాతా ట్రంప్ ఈ నిషేధాన్ని పోడిగిస్తారో లేదా వేచి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: