కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం అల్లాడి పోతోంది..ఎన్నో దేశాలలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు పోయి చేతిలో చిల్లి గవ్వ లేక సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లెక్కకి మించి ఉంది. అర్ధాకలితో ఉంటున్న కుటుంభాలు ఎన్నో ఉన్నాయి..అయితే ఇలాంటి పరిస్థితుల సమయంలో దుబాయ్ లో ఉన్న భారతీయుడికి సుడి తిరిగింది. ఎప్పుడో కొన్న లాటరీ టిక్కెట్టు కి కరోనా సమయంలో మోక్షం వచ్చింది. వివరాలోకి వెళ్తే..

 

మహ్మద్ ఖలీద్ దుబాయ్ లో టెలీ కమ్యునికేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. పదేళ్ళ క్రితమే భారత్ నుంచీ దుబాయ్ వెళ్లి సెటిల్ అయిన ఖలీద్ సరదాగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. ఊహించని విధంగా దుబాయ్ లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభమయ్యే డ్రాలో యితడు 3.50 లక్షల దిరాహ్మ్స్ గెలుచుకున్నాడు. ఈ లాటరీకి ఆరు నెంబర్ లు ఉంటాయి. ఈ లాటరీ మీరు గెలుచుకున్నారు అంటూ ఎమేరేట్స్ లో అధికారులు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు ఖలీద్ అప్పుడే తాము ఈ విషయాన్ని ద్రువీకరించామని తెలిపాడు.

 

ఖలీద్ గెలుచుకున్న లాటరీ విలువ మన భారత కరెన్సీలో దాదాపు రూ. 73 లక్షలు. ఈ లాటరీ తగలడంతో ఒక్క సారిగా అక్కడ ఫేమస్ అయిపోయాడు..కరోనా సమయంలో అతడిని అదృష్టం వరించింది అంటూ స్థానిక మీడియా సైతం ప్రచురించింది. తనకి వచ్చిన ఈ సొమ్ములో కొంత భాగాన్ని తన కుటుంభ సభ్యులకి కూడా పంచుతానని కొంత యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి ఇచ్చిన పులుపు మేరకు  ప్రభుత్వానికి  10 మిలియన్ రమదాన్ మీల్స్ కార్యక్రమానికి తన వంతు సాయం అందిస్తానని తెలిపాడు. ఒకరికి సాయం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తన మంచి మనసుని చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: